చాలా సినిమాల్లో యాక్ట్ చేసి ప్రేక్షుకుల మెప్పుని పొందిన మన సూపర్ స్టార్ రజనీ కాంత్ గారికి, భారత సినీ రంగంలో అత్యున్నతమైన పురస్కారం వరించింది. ఆ పురస్కారం ఏమిటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. కేంద్ర ప్రభుత్వం 1969 నుంచి సినీ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికీ ఈ ఉన్నతమైన పురస్కారాన్ని అందిస్తుంది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం రజినీకాంత్ గారిని ఎంపిక చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతోగాను సంతోషిస్తున్నారు.

ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి జవడేకర్ గారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను ట్వీట్ ద్వారా ప్రకటించారు. సినీరంగానికి రజినీకాంత్ చేస్తున్న సేవకు గాను ఈ అవార్డు ను ప్రకటించడం జరిగింది అని కేంద్ర మంత్రి జవడేకర్ గారు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ గారు నిలిచారు.

“భారత సినీ రంగంలో అత్యున్నతమైన నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ గారు ఒకరు. ఆయనికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ గారు ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ గారు నటుడిగా, నిర్మాతగా, ఇంక మరెన్నోసేవలు చేసారు అవి అన్ని చెప్పుకోదగినవి . ఈ అవార్డు కోసం సూపర్ స్టార్ రజనీకాంత్‌ గారిని ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు” అని జవడేకర్ ట్వీట్ చేశారు. ‌

 

x