దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు కరోనా తో విలవిలలాడుతున్నాయి. మే ఒకటి నుంచి వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సవరించండి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 4 లక్షల 12 వేల 373 కరోనా కేసులు నమోదయ్యాయి.
అలాగే గడిచిన 24 గంటల్లో 3,979 మంది కరోనా వల్ల మృతిచెందారు. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్టాలల్లో కరోనా మృత్యు రేటు ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్ డౌన్ బాట పడుతున్నాయి. ఒక వైపు దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం 12 రాష్ట్రాలలో చొప్పున లక్ష యాక్టివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. కరోనాను అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావాల్సిన చర్యలు చేపట్టారు. గెలుపు సంబరాలను పక్కనపెట్టి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టారు. నేటి నుంచి బెంగాల్లో లోకల్ రైల్స్ రద్దు చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు.అదేవిధంగా మెట్రో బస్సులు 50 శాతం రాయితీతో నడపాలని నిర్ణయించారు.
అదే విధంగా బీహార్ ప్రభుత్వం 11 రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యా అవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.