అల్లు అర్జున్ అభిమానులకు ఒక శుభవార్త. ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. సినిమా మొదటి భాగం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతలో, ఈ రోజు దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్బంగా మూవీ మేకర్స్ ఓ అప్‌డేట్ ను విడుదల చేశారు.
అది ఏమిటంటే, ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొట్టుద్ది పీక.. అంటూ సాగే ఒక పాటను మూవీ మేకర్స్ ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్రబృందం ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట యొక్క లిరిక్స్ ఆయా భాషల్లో ఎలా ఉండబోతున్నాయో తెలిపారు.
‘అల వైకుంఠపురములో’ వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా కావడంతో దీని పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.