మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, కామపిశాచి, నరహంతకుడు ఇలా ఎంత చెప్పినా అతని గురించి తక్కువే అవుతుంది. 130 మందిపై లైంగిక దాడి చేసి చంపేసిన హంతకుడు ఎట్టకేలకు అమెరికా జైల్లో చచ్చాడు. దీంతో వారి నేర చరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, అతని పేరు “అల్కాలా” ఇతను ఒక సెక్స్ సైకో. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 130 మంది ని చంపేసిన కిరాతకుడు. చిత్రహింసల పెట్టి పైశాచిక ఆనందం పొందటం అతనికి అలవాటు. సుత్తితో కొట్టి హింసిస్తూ దుర్మార్గంగా మహిళలను అనుభవించేవాడు. ఆ తర్వాత వారి ప్రాణాలను తీసేవాడు. అమెరికాలో ఈ వ్యక్తిని ‘ది డేటింగ్ గేమ్ కిల్లర్’ అని పిలిచేవారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని కొర్కోరన్ జైల్లో మరణ శిక్ష కోసం ఎదురు చూస్తున్న అల్కాలా హతమయ్యాడు.

“ది డేటింగ్ గేమ్ కిల్లర్” పేరు ఎలా వచ్చింది..?

ఏడుగురు మహిళల హత్య కేసుల్లో అతనిపై నేరం రుజువైంది. కానీ, ఇతని చేతుల్లో 130 మందికి పైగా చనిపోయినట్లు ఆధారాలు దొరికాయి. 1968లో 8 ఏళ్ల బాలికపై, 1974లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించిన అల్కాలా, 1978లో ది డేటింగ్ గేమ్ టీవీ షోలో పాల్గొన్నాడు. మహిళలపై అత్యాచారానికి పాల్పడే ముందు వాళ్ళ ఫోటోలు తీసే అలవాటు అతనికి ఉంది. దీంతో ఆ షోలో తనను ఫోటోగ్రాఫర్ గా పరిచయం చేసుకున్నాడు. అందులో విజేతగా నిలిచాడు. ఈ షో తోనే అతనికి “ది డేటింగ్ గేమ్ కిల్లర్” అనే పేరు వచ్చింది.

1979లో 12 ఏళ్ల బాలిక హత్య కేసులో అతనిపై నేరం రుజువు అయింది. దీంతో అల్కాలాకు 1980లో మరణ శిక్ష పడింది. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మరణ శిక్ష రద్దు అయింది. 2010లో మరో నలుగురు హత్య కేసులో డిఎన్ఏ(DNA) సాయంతో అతనిపై నేరాన్ని రుజువు చేశారు. దీంతో మరణశిక్ష మళ్ళీ ఖరారు అయ్యింది.

2013లో మరో ఇద్దరు మహిళల హత్య కేసులో నేరం రుజువు కావడంతో 25 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అల్కాలా దాచుకున్న బాధితుల చెవిపోగులు కీలక సాక్షంగా మారాయి. అతని ఇంట్లో దొరికిన వందకుపైగా మహిళల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. అందులో చాలా మంది ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు జైల్లో అల్కాలా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.

x