RCB vs DC మ్యాచ్ హైలైట్స్:
ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ఓటమికి రెండు విషయాలు ప్రధాన కారణం. మొదటిది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు భారీ లక్ష్యాన్ని చేరుకుంతుందా లేదా అని అభిమానులు టెన్షన్ పడుతున్న తరుణంలో 20వ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించాడు ఎబి డెవిలియర్స్.
చివరి ఓవర్లో 21 పరుగులు రాబట్టి rcb జట్టు 171 పరుగుల స్కోర్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక రెండో విషయం ఏమిటంటే ఢిల్లీ జట్టు గెలవాలంటే చివరి ఓవర్లో 6 బంతుల్లో 14 పరుగులు కావాల్సి ఉంది, ఇలాంటి తరుణంలో కోహ్లీ చివరి ఓవర్ ను సిరాజ్ కి ఇచ్చాడు. కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి డిల్లీని ఒక్క పరుగు తేడాతో ఓడిపోయేలా చేసాడు.
RCB బ్యాట్టింగ్ హైలైట్స్ :
ఇక మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బాలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, విరాట్ కోహ్లీ మరియు దేవ్ దత్ పాడిక్కాల్ ఇద్దరు వరుస బంతుల్లో తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. తర్వాత దిగిన మాక్స్వెల్ కొద్దిసేపు మెరుపులు మెరిపించిన ఎక్కువ సేపు నిలబడలేక పోయాడు.
రజత్ పటిదార్ తో కలిసి ఎబి డివిలియర్స్ చక్కటి ఇన్నింగ్స్ను నిర్మించాడు. రజత్ పటిదార్ అవుట్ అయిన కొద్దిసేపటికి వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయ్యాడు. చివర్లో ఏబీ డివిలియర్స్ భారీ సిక్సలు కొట్టడంతో బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాక్స్ వెల్ 20 బంతుల్లో 25 పరుగులు, రజత్ పటిదార్ 22 బంతుల్లో 31 పరుగులు, ఏబీ డెవిలియర్స్ 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లో మార్స్ స్టోనిస్ మినహాయిస్తే అందరూఒకొక్క వికెట్ తీశారు.
DC బ్యాట్టింగ్ హైలైట్స్ :
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన స్మిత్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. పృథ్వీ షా కొంతసేపు నిలబడ్డాడు కానీ బెంగళూర్ బౌలర్స్ దాటికి తాను కూడా ప్రేవిలియన్ చేరాడు.
ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం చివరి వరకు నిలబడి తన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో వచ్చిన హెట్మెయర్ అద్భుతంగా ఆడి అర్థ సెంచరీ చేసి గెలుపుపై అసలు పెంచాడు. కానీ బెంగళూరు బౌలర్ల అవకాశం ఇవ్వలేదు. రిషబ్ పంత్ 48 గంటల్లో 58 పరుగులు చేయగా హెట్మెయర్ 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. బెంగళూరు బాల్స్ లో హర్షల్ పటేల్ రెండు వికెట్లు, మహమ్మద్ సిరాజ్, జేమిసన్ చెరొక వికెట్ తీశారు.