DC vs SRH మ్యాచ్ హైలైట్స్:

హైదరాబాద్ మరియు ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో మొట్టమొదటి గా ఈ సీజన్లో సూపర్ ఓవర్ వచ్చింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్ జట్టు 7 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సాధించింది. ఈ సూపర్ ఓవర్ లో కెప్టెన్గా వార్నర్ చేసిన ఒక భారీ తప్పు వల్ల హైదరాబాద్ ఓడిపోవడానికి దారితీసింది.

అద్భుత ఫామ్ లో ఉన్న జాన్నీ బైర్ స్టో లాంటి బ్యాట్సమెన్ ను జట్టులో పెట్టుకొని, అప్పటికే విపరీతంగా అలిసిపోయినా విలియం సన్ ను సూపర్ ఓవర్ ఆడించడంలో అర్థం లేదు. బైర్ స్టో చేత సూపర్ ఓవర్ ఆడించి ఉంటె హైదరాబాద్ కచ్చితంగా గెలిచి ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. అతనితో ఎందుకు సూపర్ ఓవర్ ఆడించలేదో వార్నర్ కే తెలియాలి.

DC బ్యాట్టింగ్ హైలైట్స్:

ఇక ఈ రోజు మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. మొదట దిగిన పృథ్వీ షా మరియు శేఖర్ ధావన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కూలిపోయే సరికి 81 పరుగులు జోడించిన తరువాత, శిఖర్ ధావన్ 26 బంతుల్లో 28 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. కొద్దిసేపటికే పృథ్వీ షా తన అర్థ సెంచరీ పూర్తి చేసుకొని అవుట్ అయ్యాడు.

పృథ్వీ షా 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వీరిద్దరి అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మరియు స్మిత జట్టు స్కోరు బోర్డును పెంచారు. పంత్ 27 బంతుల్లో 37 పరుగులు చేయగా, స్మిత్ 25 బంతుల్లో 34 పరుగులు చేసి నాకౌట్ గా నిలిచారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్స్ లో సిద్ధార్థ కౌల్ రెండు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

SRH బ్యాట్టింగ్ హైలైట్స్:

160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించుటకు బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. మరోపక్క జానీ బైర్ స్టో అద్భుతంగా ఆడి 18 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్స్ వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు చేరుకున్నారు. కేన్ విలియమ్సన్ మాత్రం చివరి వరకు నిలబడి ఆడాడు.

విలియమ్సన్ 51 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో వచ్చిన సుజిత్ మెరుపులు మెరిపించడంతో స్కోర్స్ సమానం అయ్యాయి. మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఢిల్లీ బౌలర్స్ లో ఆవేశ ఖాన్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, అమిత్ మిశ్ర ఒక వికెట్ తీశారు. సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం సాధించింది.

x