ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో కాస్త ఊరట లభిస్తున్నప్పటికీ అదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం అందోళన కలిగిస్తోంది. నాలుగు వేల మరణాల మార్క్ మాత్రం కిందకి దిగడం లేదు. ప్రస్తుతం దేశంలో కేసులు స్వల్పంగా తగ్గాయి, గడిచిన 24 గంటల్లో మూడు లక్షల 43 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కానీ మరణాల విషయంలో మాత్రం సంఖ్య తగ్గటం లేదు. రోజుకు సుమారు నాలుగు వేలకు పైగా దీని వల్ల చనిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. మరోసారి 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 22,018 పాజిటివ్ కేసులు నమోదు కాగా కొత్తగా 96 మంది చనిపోయారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 4,305 కొత్త కేసులు వచ్చాయి. 29 మంది చనిపోయారు.
దేశంలో పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో పాజిటివ్ రేట్ అధికంగా ఉంది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివ్ రేట్ దాదాపుగా 48 శాతం ఉండగా, హర్యానాలో 37 శాతం గా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఢిల్లీ తో పాటు 18 రాష్ట్రాల్లో కేసులు తగ్గుతూ కనిపిస్తున్నాయి.