ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ కోసం హైదరాబాద్ కు బయలుదేరింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘మహానటి’ సినిమా తో అందరి చేత ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఆయన ‘ప్రాజెక్ట్-k’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో కట్టుదిట్టమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు దీపికా మరియు ఆమె బృందానికి విలాసవంతమైన వసతి ఏర్పాట్లు చేశారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ మరియు దీపికాపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ దీపికా పడుకొనే తో పాటు అమితాబచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

x