స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మూవీమేకర్స్ దీని గురించి అధికారికంగా ఏ విషయం వెల్లడించలేదు. రెండు భాగాల విడుదల మధ్యలో అల్లుఅర్జున్ మరొక సినిమా చేయనున్నారు. అల్లుఅర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు అల్లు అర్జున్ యొక్క చిత్రాల పై అధికారిక ధ్రువీకరణ చేశారు.

“అల్లు అర్జున్ పుష్ప రెండు భాగాలుగా విడుదల అవుతుంది. పుష్ప పార్ట్ వన్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ “ఐకాన్” సినిమా ను చేయనున్నారు. ఐకాన్ సినిమా పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ కి వెళ్లనున్నారు. ఈ లైన్ అప్ లో ఎటువంటి మార్పులు ఉండవని” బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

ఈ మూడు చిత్రాల తో పాటు అల్లుఅర్జున్ మరో మూడు సినిమాలను కూడా చేయబోతున్నారు. ఎ.ఆర్.మురగదాస్, బోయపాటి శ్రీను మరియు కొరటాల శివ తో అల్లు అర్జున్ తదుపరి సినిమాలు ఉన్నట్లు బన్నీ వాసు ధృవీకరించారు. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించబోతోంది. వీరిద్దరు ఇంతకముందు ఇదే బ్యానర్ లో బ్లాక్ బస్టర్ సరైనోడు సినిమాను తీశారు.

“ఐకాన్” సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నారు. పుష్ప షూటింగ్ తో పాటు ఈ షూటింగ్ కూడా మొదలు కావాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ మొదటి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఐకాన్ సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. అల్లుఅర్జున్ ఈ ఆరు ప్రాజెక్టుల తో రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల వరకు బిజీగా ఉండనున్నారు.

x