దేశంలో కరోనా సెకండ్ వైఫ్ కొనసాగుతుంది. కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరగడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 59 వేల 170 కేసులు నమోదయ్యాయి.అంతేకాదు గడిచిన 24 గంటల్లో 1761 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 53 లక్షల 21వేల 89 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య ఒక లక్షా 80 వేల 530 కి చేరాయి. దేశంలో ప్రస్తుతం 20 లక్షల 31 వేల 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు కోటి 31 లక్షల 8 వేల 582 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో లక్షా 54 వేల 761 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల 71 లక్షల మందికి టీకాల పంపిణీ జరిగింది.

x