ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తుంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు ఏపీ స్కూల్స్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 35 వేల 196 మందికి పరీక్షలు నిర్వహించగా 758 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 175 పాజిటివ్ కేసులు నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 13 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 95 వేల 879 కి చేరింది. 24 గంటల వ్యవధిలో మహమ్మారి కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు.

చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు చొప్పున మృతిచెందారు.తాజా మరణాలతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7201 కి చేరింది. ఒక రోజులో 231 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 3 వేల 469 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

స్కూల్స్ లోని విద్యార్థులను కూడా కరోనా వెంటాడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు స్కూల్ లో ఎనిమిది మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించింది.

x