దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,21,476 కేసులు నమోదు అయ్యాయి. మరోపక్క మరణాల రేటు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఏపీలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీ లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 10, 413 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా ఏపీలో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో కూడా కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తున్నాయి. కరోనా వల్ల తెలంగాణాలో కొత్తగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

x