. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ వివరాలు
. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు
. రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు
. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు
. ఏపీ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు
1. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ వివరాలు:
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలు పైగా దాటాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో రెండు లక్షల 739 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ఇక మృతుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఒక్కరోజులో 1,035 మంది కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,73,123 కు చేరగా, ప్రసుతం యాక్టివ్ కేసులు 14 లక్షల 71 వేల 877 గా ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుంది, కానీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలుచేస్తున్నారు.
2. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు:
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతంగా వ్యాపించడంతో అక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర లో 58,952 మందికి పాజిటివ్ రాగా 277 మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు జనతా కర్ఫ్యూ విధించింది. దీంతో ముంబై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ పనులు చేస్తున్న వలస కార్మికులు సొంత ఊర్ల బాట పట్టారు. జనతా కర్ఫ్యూ లో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలు అవుతుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇక థియేటర్లో సాపింగ్ మాల్స్ మూసివేశారు.
3. రాజస్థాన్ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు:
విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో రాజస్థాన్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఈనెల 16 నుంచి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు, అన్ని నగరాలు పట్టణాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. దీంతో షాప్స్ అన్ని ఐదు గంటలకే మూసివేయనున్నారు.
4. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు:
తెలంగాణలో లో కూడా కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 3,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38 లక్ష్యాలకు చేరగా మృతుల సంఖ్య 1,788 కి చేరండి.
5. ఏపీ లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల వివరాలు:
ఇక ఏపీ విషయానికి వస్తే నిన్న 4157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా కరోనా తో 18 మంది మృతి చెందారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఒక్కరోజులోనే 18 మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. నెల్లూరులో అత్యధికంగా నలుగురు చనిపోగా, చిత్తూరు, కృష్ణా లో ముగ్గురు చొప్పున చనిపోయారు. విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,339 కి పెరిగింది. ఇక మొత్తం బాధితుల సంఖ్య 9,37,049 కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు బయటపడగా, శ్రీకాకుళంలో 522 కేసులు, చిత్తూరులో 517 కేసులు, గుంటూరులో 434 కేసులు, విశాఖపట్నంలో 417 పాజిటివ్ కేసులు, కర్నూల్ లో 386 కేసులు, అనంతపురంలో 297 కేసులు, నెల్లూరులో 276 కేసులు, ప్రకాశంలో230 మందికి వైరస్ సోకింది.