గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కాసుల వివరాలు:

భారతదేశంలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశం లో గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షలకు చేరువయ్యాయి. ఒక రోజులోనే 2 లక్షల 95 వేల 41 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్కరోజులో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య రెండు వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2023 మంది చనిపోయారు. వస్తున్న కేసుల్లో 50 శాతం కేసులు 5 రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో కరోనా కాసుల వివరాలు:

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తొలిసారిగా రికార్డు స్థాయిలో 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 6 వేల 5 వందల 42 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 20 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల 488 గా ఉంది.

x