ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న మరణాల రేటు మాత్రం వణుకు పుట్టిస్తుంది. మే నెలలో దేశంలో గంటకు సుమారు 155 మంది కరోనా కు బలైపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.

భారతదేశం పై కరోనా మహమ్మారి పంజా విసిరి మునుపెన్నడూ చూడని విధంగా కరోనా విపత్కర పరిస్థితులను మనకు గత మే నెలలో చూపించింది. అటు ప్రజలను ఇటు వైద్య రంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ ఒక్క నెలలో రోజువారి కేసుల సంఖ్య ఏకంగా 4 లక్షలు దాటింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు మరియు మరణాలు ఈ నెలలో మన దేశంలో వెలుగుచూశాయి.

దేశంలో తొలి మరణం నమోదు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న మృతుల సంఖ్య కేవలం మే నెలలోనే 33 శాతం మంది చనిపోయారు. ఆరు రాష్ట్రాల్లోనే సుమారు 70 శాతం మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మే నెలలో భారత్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య సుమారు 1,02,000. ఏ దేశంలోను ఒక్క నెలలో ఇన్ని మరణాలు సంభవించలేదు.

ఈ లెక్కన చూస్తే భారతదేశంలో మే నెలలో గంటకు దాదాపు 155 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత స్థానంలో అమెరికా ఉండి. మే నెలలో భారత్లో ప్రతిరోజూ దాదాపు 3,400 కు పైగా ప్రజలు కరోనా వల్ల చనిపోగా, వరుసగా 13 రోజుల పాటు 4 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గతంలో 4 లక్షలకు చేరిన రోజు వారి కేసులు ప్రస్తుతం లక్ష 30 వేలకు దిగువకు పడిపోయింది. కానీ, మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు.

x