దేశంలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు మరియు మృతుల వివరాలు..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేసులు లక్ష లోపు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గురువారం రికార్డు స్థాయిలో మరణాలు రావడంతో అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ రోజు మరణాల సంఖ్య తగ్గింది. గత 24 గంటల్లో 3,403 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్షా 34 వేల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కేసులు తగ్గటంతో పాటు వ్యాక్సినేషన్ స్పీడ్ ను కూడా కేంద్రం పెంచుతుంది. ఇప్పటివరకు 24 కోట్ల 60 లక్షల టీకా డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

తెలంగాణాలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు మరియు మృతుల వివరాలు..

తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష 24 వేల 66 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడ్డ వారిలో 2,493 మంది చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 16 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వరకు మొత్తం 3,456 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కోవిడ్ కేసులు మరియు మృతుల వివరాలు..

ఏపీలో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,239 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మరో 61 మంది మహమ్మారి వల్ల చనిపోయారు. వీరితో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 11,824 చేరింది. ప్రస్తుతం ఏపీ లో 96 వేల యాక్టీవ్ కేసులు ఉన్నాయి

x