.హర్యానాలోని గురుగ్రామ్ మురికి వాడలో జరిగిన అగ్నిప్రమాదం

.నోయిడా సమీపంలోని స్లమ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాద

.విశాఖ దువ్వాడ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం

1. హర్యానాలోని గురుగ్రామ్ మురికి వాడలో జరిగిన అగ్నిప్రమాదం:

ఎండలు మండిపోతు ఉండటంతో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు మండిపోతు ఉండటంతో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ మురికి వాడలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా పూరిగుడిసెలు బుగ్గిపాలయ్యాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు, చూస్తూ ఉండగానే విస్తరించి పోయాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం ప్రాణం దక్కించుకున్నారు. కట్టుబట్టలు తప్ప తమకు ఏమీ మిగలలేదు అని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

2. నోయిడా సమీపంలోని స్లమ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం:

అటు నోయిడా సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్లమ్ ఏరియా లో మంటలు విరిగిపడ్డాయి. కన్ను మూసి తెరిచే లోపే పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసింది. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

3. విశాఖ దువ్వాడ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం:

విశాఖ దువ్వాడ సెజ్ లో మంటలు చెలరేగాయి. పూజ స్క్రాప్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది సార్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

x