ధనుష్ యొక్క “జగమే తంత్రం” సినిమాను మూవీ మేకర్స్ థియేటర్స్ లో కాకుండా OTT ప్లాట్ ఫామ్ లో విడుదలచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పుడు, ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

జగమే తంత్రం సినిమాను జూన్ 18 న నెట్‌ఫ్లిక్స్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తమిళ మరియు తెలుగు భాషలలో లభిస్తుంది. ఇది ఇతర భాషలలో కూడా లభిస్తుందా అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్-కామెడీ సినిమాలో ఐశ్వర్య లేక్ష్మి హీరోయిన్ పాత్రలో నటించింది.

ధనుష్ నుంచి ఇటీవల విడుదల చేసిన కర్ణన్ మూవీ కూడా OTT విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 9 న తెరపైకి వచ్చింది ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమా డిజిటల్ విడుదల త్వరలోనే అధికారికంగా రానుంది. కర్ణన్ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు మరియు కలైపులి ఎస్ ఈ సినిమాను నిర్మించారు.

x