2021 వ సవంత్సరం తమిళ చిత్ర పరిశ్రమలో విజయం సాధించిన అతికొద్ది సినిమాలల్లో ధనుష్ “కర్ణన్” మూవీ ఒకటి. నటుడు ధనుష్ మరియు ప్రతిభావంతులైన చిత్రనిర్మాత మారి సెల్వరాజ్ సహకారంతో ఈ చిత్రం నిర్మించబడినందున ఈ సినిమా పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

ఇప్పుడు, కర్ణన్ సినిమా OTT ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మే 14 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. థియేటర్లలో చూడటం తప్పిన వ్యక్తులు వచ్చే శుక్రవారం ప్రైమ్‌లో ఈ సినిమాను చూడవచ్చు. ఇతర రాష్ట్ర ప్రేక్షకులు కూడా ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే ఈ సినిమా విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం కుల వివక్షత యొక్క తీవ్రమైన సమస్యలను వివరిస్తుంది. ఎస్ కలైపులి తనూ వి క్రియేషన్స్ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. బెల్లాంకొండ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అతి త్వరలో తెలుగులోకి రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి .

x