సూర్య నటించిన ఆకాశమే సరిహద్దుగా సినిమా తరువాత, మరో తమిళ హీరో ప్రత్యక్ష డిజిటల్ విడుదలను ఎంచుకున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన “జగమే తందిరం” సినిమాలో ధనుష్ హీరోగా నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 18న నెట్ ఫ్లెక్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం 190 దేశాలలో 17 వేర్వేరు భాషలలో ఏకకాలంలో విడుదల కానుందని నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. చివరికి, దీన్ని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది.

ఈ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల క్రితమే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగమే తందిరం సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్ కాస్మో, మరియు జోజు జార్జ్ ఇతర కీలక పాత్రలలో నటించారు. శశికాంత్ ఈ ప్రాజెక్టును నిర్మించారు మరియు సంతోష్ నారాయణన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

x