టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఆయన టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న సినిమా “రౌడీ బాయ్స్”. తన సోదరుడు శీరీస్ కొడుకైనా ‘ఆశిష్ రెడ్డి’ ని ఈ సినిమాతో దిల్ రాజు హీరోగా పరిచయం చేస్తున్నారు.

పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు అన్ని సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇందులో భాగంగా రౌడీ బాయ్స్ సినిమాను దిల్ రాజు జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా దిల్ రాజు చాలా జాగత్తలు తీసుకుంటున్నాడు.

ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించినప్పుడు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా ను చూసి ఆశ్చర్యపోయారు. వారు దిల్ రాజు తో అసలు ఇది మీ సినిమానేనా అని అడిగారు. ఎందుకంటే ఈ సినిమాలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంది. దిల్ రాజు సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను కలిగి ఉంటాయి.

దిల్ రాజు మాట్లాడుతూ, “ఈ సినిమాలో కొంచెం హద్దులు దాటామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ సినిమా యూత్ ఫుల్ గా ఉండాలని హుషారు మూవీ డైరెక్టర్ హర్షకు చెప్పి ఈ కథను రెడీ చేశాము. తమ సంస్థ నుంచి వచ్చిన తొలి ప్రేమ‌, హ్యాపీ డేస్, ఆర్య వంటి సినిమాల తరహాలో ఈ సినిమా కూడా చాలా యూత్ ఫుల్ గా మరియు అందరికి నచ్చే విధంగా ఉంటుందని” చెప్పుకొచ్చారు.

x