ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు కొన్ని మృగాలు అదే పనిగా వేధింపులకు దిగుతుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళల తిరిగి ఇంటికి వచ్చే వరకు భయం. అలాంటి మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం “దిశ యాప్” ని రూపొందించింది. మహిళల పై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుక మహిళా పోలీసులు ఈ దిశ యాప్ పై విస్తృత ప్రచారం చేపట్టారు.

వర్చువల్ విధానంలో కళాశాల విద్యార్థులకు ఈ యాప్ గురించి అవగాహన కల్పించనున్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్ ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతుంది. మహిళలు మృగాలకు బుద్ధి చెప్పాలంటే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులు క్షణాల్లో అక్కడికి వచ్చి ఆ మృగాల పని పడతారు. మీ మొబైల్ ఫోన్ లో కేవలం దిశ యాప్ ఉంటే చాలు.. మహిళలకు నలుదిశలా రక్షణ కవచమే.

మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతుంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఈ దిశ యాప్ దోహదపడుతుంది. దిశ యాప్ లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు పోలీస్ స్టేషన్, ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంక్, మెడికల్ షాప్స్ వివరాలు కూడా ఉన్నాయి. కంట్రోల్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఒకే సమయంలో అందరికీ సలహాలు మరియు సూచనలు ఇస్తారు.

విపత్కర పరిస్థితుల్లో సమయం లేకపోతే మీ ఫోన్ ను గట్టిగా అటు ఇటు ఊపితే చాలు.. పోలీసులకు సందేశం ఆటోమేటిక్గా చేరిపోతుంది. వెంటనే అప్రమత్తమై వారు కాల్ బ్యాక్ చేస్తారు. అప్పుడు కూడా ఫోన్ స్పందించకపోతే మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్(GPS) ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు.

మహిళా పోలీసులు, గ్రామ వాలెంటరీలు ఇంటింటికి వెళ్లి “దిశ యాప్” పై అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళలపై వేధింపులకు పాల్పడితే ఫిర్యాదులు చేసే విధంగా సైబర్ క్రైమ్ వాట్సాప్ ను రూపొందించింది.

x