గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు & రికవరి రేటు వివరాలు:

తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక పక్క వ్యాక్సినేషన్ జరుగుతున్న ఈ స్థాయిలో కేసు నమోదు కావడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 8 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38 మంది మృతి చెందారు. ఇక రికవరీ రేటు చూసుకుంటే 83.57 శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 3307 మంది డీఛార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8126 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో తెలంగాణాలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు:

గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు,  జీహెచ్ఎంసీ పరిధిలో ఒక రోజులోనే 1259 మందికి కరోనా సోకింది. మేడ్చల్ జిల్లాలో 676 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 591 కేసులు, మంచిర్యాల జిల్లాలో 233 కేసులు, సిద్దిపేట జిల్లాలో 306 కేసులు, కరీంనగర్ జిల్లాలో 286 కేసులు, ఖమ్మం జిల్లాలో 339 కేసులు, నల్గొండ జిల్లాలో 346 కేసులు, మహబూబ్నగర్ జిల్లాలో 306 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 497 కేసులు, జగిత్యాల జిల్లాలో 264 కేసులు నమోదైయ్యాయి. . తాజా కేసుల తో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,95,232 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం మండలాల సంఖ్య 1,999 కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

x