సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని, కనీసం తమ కష్టాన్ని చూసి కూడా తగిన ఫలితం ఇవ్వట్లేదని చాలామంది అంటున్నారు. కానీ అదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం హీరోయిన్స్ హీరోలకు దీటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయానికి వస్తే, సౌత్ లో నయనతార, నార్త్ లో ఆలియా భట్ ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారు.
చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయనతారను చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం అడగగా ఆమె నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే మరోపక్క సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రం కోసం ఆలియా భట్ ఏకంగా 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని తాజా సమాచారం.
ఆలియా భట్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా థర్డ్ వేవ్ వల్ల వాయిదా పడింది. ఇంకా రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్‌కహానీ, బ్రహ్మాస్త్ర వంటి భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలకు గాను ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలియాల్సి ఉంది.