1999వ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ‘తమ్ముడు’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ప్రముఖ స్టార్ గా నిలబెట్టండి. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ గారు మొదటి ఎంపిక కాదన్నా విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పి.ఏ అరుణ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఈ సినిమాకు మొదటి ఎంపిక పవన్ కళ్యాణ్ కాదు, అజిత్ అని వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ, “ఆ సమయంలో మేము చెన్నైలో ఉండే వాళ్లము, అంతేకాదు నాకు తమిళ్లో పెద్ద సర్కిల్ ఉండేది. ఆ సమయంలో నేను అజిత్ కు తమ్ముడు సినిమా కథను చెప్పినప్పుడు అతను పవన్ కళ్యాణ్ ను సంప్రదించాలని కోరారు” అని అరుణ్ ప్రసాద్ గారు చెప్పుకొచ్చారు.

“గతంలో నేను పవన్ కళ్యాణ్ చేసిన చిత్రాలను చూశాను. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ నచ్చడంతో నేను ఈ చిత్రంలో ఆయనను నటింప చేయాలని నిర్ణయించుకున్నాను” అని ఆయన తెలిపారు.

తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా అందులోని నటీనటులు మరియు సిబ్బందికి కూడా మంచి పేరును తీసుకువచ్చాయి. ఈ సినిమాలో ప్రీతి, అదితి గోవిత్రికర్, చంద్రమోహన్ మరియు అచ్యుత్ కీలక పాత్రలో నటించారు.

x