డోలో 650 ఈ పేరుకు భారతదేశంలో పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో చాలా మంది ఈ టాబ్లెట్ ను వాడే ఉంటారు. సాధారణంగా ఈ టాబ్లెట్ ను జ్వరం తగ్గడానికి ఉపయోగిస్తారు. కరోనా సమయంలో ఈ డోలో 650 అనేది ఒక బ్రాండ్ గా ఏర్పడింది.

మనదేశంలో చాలా సంవత్సరాల నుండి డోలో 650 టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. కానీ, మహమ్మారి కరోనా సమయంలో దీని వినియోగం మరో స్థాయికి చేరింది. అధికారిక నివేదికల ప్రకారం, 2020లో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుండి భారతదేశంలో 350 కోట్లకు పైగా డోలో 650 మాత్రలు అమ్ముడయ్యాయి.

IQVIA పరిశోధనా సంస్థ అందించిన సమాచారం ప్రకారం, కోవిడ్ వ్యాప్తికి ముందు భారతదేశం సుమారు 7.5 కోట్ల డోలో 650 స్ట్రిప్పులను విక్రయించింది. అంటే ఒక్కో స్ట్రిప్‌ లో 15 మాత్రలు ఉంటాయి. 2021 లో దీని విక్రయాలు 14.5 కోట్ల స్ట్రిప్పులకు (217 కోట్ల టాబ్లెట్‌లు) పెరిగాయి.

2021 లో మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన జ్వరం టాబ్లెట్స్ లో డోలో (DOLO) రెండో స్థానంలో ఉంది. దీని టర్నోవర్‌ 307 కోట్లు. GSKకి చెందిన Calpol మొదటి స్థానంలో ఉంది. దీని టర్నోవర్‌ 310 కోట్లు. Crocin టాబ్లెట్ మాత్రం ఆరో స్థానంలో ఉంది.

గూగుల్ సెర్చ్ విషయానికి వస్తే, మన దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన మందుల్లో డోలో (DOLO) కూడా ఒకటి. 2020లో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుండి దీనికి దాదాపు 2 లక్షల సెర్చ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో దీని సెర్చ్ రిజల్ట్స్ మరింత గరిష్ట స్థాయికి చేరుకుంది.

x