మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యామిలీ పర్సన్. ఆయనకు షూటింగ్ లేకపోతే ఎక్కువగా తన ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మనవరాళ్లతో గడపడం మనం చూస్తూ ఉంటాము. అయితే, సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట పండగ చేసుకుంటున్నారు.

ఐతే ఈ రోజు భోగి పండుగ కావడంతో మొదట వారందరు కలిసి భోగి మంటలు వేశారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుణ్ తేజ్ తో కలిసి దోశలు వేశారు. అయితే, దోశలు వేసే క్రమంలో చిరంజీవి వేసిన దోశ సరిగ్గా రాలేదు. మరోపక్క వరుణ్ వేసిన దోశ బాగానే వచ్చింది. దీంతో చిరంజీవి ఒక్కసారిగా చిన్న పిల్లవాడిగా అల్లరి చేశాడు. వరుణ్ వేసిన దోశను చిందరవందర చేశాడు.

నా దోశ సరిగ్గా రాలేదు.. అందుకే నాకు కుళ్లు వచ్చేసింది.. అంటూ వరుణ్ వేసిన దోశను చెడగొట్టి ఇది ఉప్మా అంటూ చిరు అల్లరి చేశాడు. చిరంజీవి అల్లరితో కుటుంబ సభ్యులందరు చాలా ఎంజాయ్ చేశారు. ఈ ఫన్నీ వీడియో ను వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కి ‘బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి’ అనే క్యాప్షన్ ను జోడించి అందరికి భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

x