దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన పుష్ప ఆల్బమ్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఒక ఊపు ఊపుతుంది. పుష్ప పాటలు సామాన్యుల నుంచి మొదలు పెడితే సెలబ్రిటీస్ వరకు అందరు తెగ లైక్ చేస్తున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ‘శ్రీవల్లి’ ట్యూన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ సాంగును రిలీజ్ చేసింది.
దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో తాజాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. స్వయంగా దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ సినిమా టైటిల్ సాంగ్ కు ప్రస్తుతం మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. నెటిజెన్లు ఈ సాంగ్ సూపర్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ తో శర్వానంద్ సినిమాపై బజ్ మొదలైంది. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న శర్వానంద్ కు ఈ బజ్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పవచ్చు.
దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమా నుంచి “తెలుసా.. తెలుసా..” అనే పాట రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ పడితే చిన్న సినిమాలకు కూడా భారీ బజ్ వస్తుందని మరింత నమ్మకం కలుగుతుంది. ఇక ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ఉన్న పుష్ప 2 మరియు చిరంజీవి బాబి సినిమా కు ఎలాంటి మ్యాజిక్ ఇస్తాడో చూడాలి.