న్యూజిలాండ్ సమీపంలో రెండు భారీ భూకంపాలు గంటల వ్యవధిలో సంభవించాయి, దీనితో న్యూజిలాండ్ వణికిపోయింది, వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేసారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పసిఫిక్ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకు ముందు రెక్టార్ స్కేలుపై 7.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని, న్యూజిలాండ్ అధికారులు తెలిపారు.

Earthquake in New Zealand 1

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు, ఈ భూకంపాల నేపథ్యంలో న్యూజిలాండ్, అమెరికాలో సునామీ హెచ్చరికలు జారీ చేసారు. కొద్ది సేపటి తరువాత అమెరికాలో సునామీ హెచ్చరికల కేంద్రం, హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

భూకంపం భయంతో ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే గడిపారు. మొదటి భూకంపం న్యూజిలాండ్ లోని కేర్మాడెక్ దీవుల వద్ద సముద్రంలో 21 కిలోమీటర్ల లోతున, రెండోది 19 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు అమెరికా భౌతిక సర్వే కేంద్రం తెలిపింది.

Earthquake in New Zealand 2

భారత్ కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8గంటల 30 నిమిషాలకు భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఇక తీర ప్రాంత ప్రజలకు సునామి ముప్పు ఉందని, న్యూజిలాండ్ ఎమర్జెన్సీ ఏజెన్సీ హెచ్చరించింది. సముద్ర తీరా ప్రాంతంలో ఇల్లు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని, అలాగే భూమి కోతకు గురి కావచ్చని తెలిపింది.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఇండోనేసియాలోనే 120 యాక్టీవ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అగ్నిపర్వతం పేలుతుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తుంది.

అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడతాయి?

అగ్నిపర్వతం అంటే గ్రహం లాంటి పెద్ద ద్రవ్యరాశి గల ఖగోళ వస్తువు పైపెంకులో ఏర్పడే చీలిక అని అందరు గుర్తిస్తారు.

ఉపరితలం క్రింద శిలాద్రవం ఉండే ప్రాంతం నుండి ఈ చీలిక ద్వారా వేడి లావా, అగ్నిపర్వత బూడిద వాయువులు, వత్తిడితో బయటకు చిమ్ముతాయి. టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ, ఒకదానిని ఒకటి దూరంగా జరుగుతూ, ఒకదానిని ఒకటి దగ్గరవుతూ ఉన్న చోట్ల అగ్నిపర్వతాలు కనిపిస్తాయి.

చాలా వరకు ఇవి సముద్రాల లోపల ఉంటాయి. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ వద్ద విడిపోతున్న టెక్టోనిక్ ప్లేట్ల వలన ఉద్భవించే అగ్నిపర్వతాలు ఉన్నాయి. పసిఫిక్ రింగ్ అఫ్ ఫైర్ లో దగ్గర అవుతున్న టెక్టోనిక్ ప్లేట్ల వాళ్ళ ఏర్పడే అగ్నిపర్వతలు ఉన్నాయి. పెంకులోని పలకలు సాగుతూ, సన్నబడుతూ ఉన్న చోట్ల కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి.

x