సంతోష్ శోభన్ మరియు కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “ఏక్ మినీ కథ” ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ల తో, ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.
ఏక్ మినీ కథ యొక్క తాజా అప్‌డేట్ ఏమిటంటే, మూవీ మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా టక్ జగదీష్ మరియు లవ్ స్టోరీ వంటి సినిమాలు వాయిదా పడుతున్న తరుణంలో, ఏక్ మినీ కథ థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో ఎక్కువ సినిమాలు విడుదల కాకా పోవడం తో, ఈ సినిమాను విడుదల చేస్తే మంచి ప్రయోజనం ఉంతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
కార్తీక్ ఏక్ మినీ కథకు దర్శకత్వం వహిస్తున్నారు మరియు యువి క్రెయేషన్స్ మరియు మాంగో మాస్ మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.