ప్రధాన హీరోగా సప్తగిరి యొక్క పనితీరు అతనికి ఉత్తమ ఫలితాలను ఇవ్వకపోవడంతో అతను ఇప్పుడు మళ్ళి కామిడీ పాత్రలు చేయటానికి తిరిగి వచ్చాడు. కామెడీ యాక్టర్ సప్తగిరి ఈ నెల 27 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్న “ఏక్ మినీ కథ” సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు.
సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సప్తగిరి కామెడీ హైలైట్ అంటున్నారు మూవీ మేకర్స్. అతను ఈ సినిమాలో ఒక ట్రక్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. సంతోష్ తన మగ అవయవ పరిమాణ సమస్యతో వివాహం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు.
ఈ చిత్రం చివరి అరగంటలో సప్తగిరి మరియు సంతోష్ శోభన్ మధ్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఏక్ మినీ కథ సినిమా ఒక ప్రత్యేకమైన కథాంశంతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు మరియు యువి కాన్సెప్ట్స్ ఈ సినిమాను నిర్మించారు.