ఏక్ మినీ కథ ను సంతోష్ శోభన్ మరియు కావ్య థాపర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చమత్కారమైన మరియు నవ్వులతో కూడిన ప్రోమోలతో డిఫరెంట్ గా ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు చిత్ర యూనిట్.కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి కొత్త ప్రోమో విడుదల అయ్యింది.

ప్రోమో చూస్తుంటే ఇది ఆడియో ఆల్బమ్‌లోని రెండవ పాట యొక్క ప్రోమో అని అనిపిస్తుంది. ఈ ప్రోమో క్రికెట్ మ్యాచ్ బ్యాక్‌డ్రాప్‌తో కనిపిస్తుంది. కథానాయకుడు సంతోష్ క్రికెట్ బ్యాట్ అడిగితే సుదర్శన్ ఒక మినీ సైజ్ క్రికెట్ బ్యాట్ ఇస్తాడు. దాని తర్వాత ఒక మినీ బాల్ కూడా ఇస్తాడు, తర్వాత బ్రహ్మాజీ తో ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ కూడా చాలా బాగుంది.

ఏక్ మినీ కథ ఈ నెల 30 న విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, యువి కాన్సెప్ట్స్ మరియు మాంగో మాస్ మీడియా దీనిని నిర్మిస్తున్నాయి.

x