ఇంగ్లాండ్ జట్టుకు మరో పెద్ద సమస్య వచ్చింది. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ముగిసిన తర్వాత ఆటగాళ్లలో కొంత మందికి స్వల్ప లక్షణాలు కనిపించడంతో జట్టుకు కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. అందులో ముగ్గురు జట్టు సభ్యులు కాగా, మిగిలిన నలుగురు సహాయక సిబ్బంది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. వాళ్ళ పేర్లను బయట పెట్టకుండా మొత్తం జట్టును పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచింది.
మరోవైపు గురువారం నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌పై అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలకు చెక్ పెడుతూ బెన్‌స్టోక్స్ సారథ్యంలో బోర్డు 18 మందితో మరో జట్టును ఎంపిక చేయనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. తొలి వన్డే మ్యాచ్ కార్డిఫ్‌లోనే జరుగుతుందని స్పష్టం చేసింది.