ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టి20 సిరీస్ మ్యాచుల్లో రెండు టి20 మ్యాచులు అయిపోగా, ఈ రోజు మూడో టి20 మ్యాచ్ జరిగింది. ఈ రోజు జరిగిన మూడో టి20 మ్యాచులో ఇండియా ఓడిపోక తప్పలేదు.

ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ను తీసుకోగా, ఇండియా బ్యాటింగ్ కి దిగింది. బ్యాటింగ్ కి మొదటగా రోహిత్ శర్మ మరియు కే ఎల్ రాహుల్ దిగారు. కే ఎల్ రాహుల్ నాలుగు బంతులు ఆడి స్కోర్ ఏమి చేయకుండా ప్రవిలియన్ బాట పట్టాడు.

ఆ తరువాత వచ్చిన ఇషాన్ కిషన్ మరియు పిచ్లో ఉన్న రోహిత్ శర్మ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పొయ్యారు, కేవలం రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు, ఇంకా ఇషాన్ కిషన్ 9 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ మరియు పంత్ మంచి పార్టనర్ షిప్ తో కాసేపు బాగానే ఆడారు.

తరువాత కొద్ది సేపటికి రిషబ్ పంత్ రన్ అవుట్ అయ్యి వెనుతిరిగాడు. రిషబ్ పంత్ 20 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 9 బంతుల్లో 9పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్య తో కోహ్లీ చివరి వరకు నిలబడి ఆడాడు. టీం ఇండియా 20 ఓవర్లో 156 పరుగులు చేసి 6 వికెట్స్ ను కోల్పోయింది.

3rd T20 Match Highlights

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీం బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ ను వేసి ఇండియా టీంను కట్టడి చేశారు. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా రాణించాడు. ఒక పక్కన వికెట్స్ వరసగా పడిపోతూ ఉండగా కోహ్లీ మాత్రం గట్టిగ నిలబడి చివరివరకు ఆడాడు. విరాట్ కోహ్లీ, ఈ మ్యాచులో 46 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అందులో 8 ఫోరులు 4 సిక్సలు ఉన్నాయి.

ఇండియా టీం పవర్ ప్లే లోనే 3 వికెట్స్ ను కూలిపోయి కేవలం 24 పరుగులు మాత్రమే చేసింది. 15 ఓవర్లకు టీం ఇండియా 87 పరుగులు మాత్రమే చేశారు. కానీ చివరి 5 ఓవర్లో ఇండియా 69 పరుగులను సాధించి, మొత్తం మీద 20 ఓవర్ల కు 156 పరుగులను సాధించింది.

ఇంగ్లాండ్ టీం బౌలర్స్ అయిన మార్క్ వుడ్ 3 వికెట్స్ ను మరియు క్రిస్ జోర్డాన్ 2 వికెట్స్ ను తీసుకున్నారు. ఇక తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లాండ్ టీం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ టీం 18.2 ఓవర్లోనే 158 పరుగులు చేసి 8 వికెట్స్ తేడాతో టీం ఇండియాను ఓడించింది.

ఈ మ్యాచ్ లో బైర్ స్టో 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 52 బంతుల్లో 83 పరుగులు చేసి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పుడు వరకు జరిగిన మూడు మ్యాచుల్లో రెండు ఇంగ్లాండ్ మరియు ఒక్కటి ఇండియా గెలిచారు. ఇంకా రెండు మ్యాచ్లు జరగాల్సి ఉంది.

x