సూయజ్ కాలువ లో ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ షిప్ ను బయటకు తీసేందుకు రోజులు లేదంటే వారలు కూడా పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో సూయజ్ లో నౌకలు భారీగా నిలిచిపోతాయి. ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణా కు ఆధారమైనది. మార్చి 23 నుంచి సూయజ్ కాలువ నౌక రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ వైపు కాలువ మార్గాలలో 200లకు పైగా నౌకలు నిలిచిపోయాయి.
రానున్న కొన్ని రోజులు నౌకల రాకపోకలు భారీగా నిలిచిపోనున్నాయి ఈ మార్గంలో, అలా సూయజ్ కాలువ లో నిలిచిపోయే నౌకల సంఖ్య 300 వరకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో అటు వైపు వెళ్లే నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరువైపులా భారీ సంఖ్యలో నౌకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సరుకుల రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
రోజుకు సుమారు 70 వేల కోట్ల నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సూయజ్ కాలువ లో ఇరుక్కుపోయిన షిప్ టైవాన్ లోని ఎవర్ గ్రీన్ మెరైన్ అనే సంస్థకు చెందినది. సూయజ్ కాలువ లో దక్షిణం వైపు ఒడ్డున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు అగిపోయాయి.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ పైన సూయజ్ ప్రభావం తప్పదు, ముఖ్యంగా భారత్ నుంచి అనేక ఎగుమతులు దిగుమతులు ఈ కాలువ ద్వారా వెళ్తూ ఉంటాయి. అవన్నీ నిలిచిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామమే. నూనె మరియు పత్తి, ఆటో పరిశ్రమ ఉత్పత్తులు, యంత్రాల విడిభాగాలు వంటివి ఐరోపా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా లకు ఎగుమతి అవుతూ ఉంటాయి.
ఉప్పు ఉత్పత్తి లు, తుక్కు యంత్రాల విడి భాగాలు, ప్రతి సంవత్సరం సూయజ్ కెనాల్ ద్వారా భారత్ కు దాదాపుగా 14 లక్షల కోట్ల మేర వాణిజ్యం సాగిస్తుంది. ప్రస్తుత సమస్య కారణంగా 5 నుంచి 15 శాతం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరల కలవచ్చు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగు పాయింట్లు ప్రణాళికను భారత్ రచించింది.
ఎక్కువ కాలం నిల్వ వుండని సరుకు ఉన్న నౌకలను అంచనావేసి మొదట వాటిని పంపించడం. మాట్లాడుకున్న ధరలకే సరుకు ధరలు ఉండేలా రవాణా లో భాగస్వాములు కావడంతో చర్చలు జరపడం, ధరల విషయంలో నిలకడను ప్రదర్శించాలని షిప్పింగ్ సంస్థలకు విజ్ఞప్తి చేయడం. 15 రోజుల అదనపు సమయం తీసుకున్నప్పటికీ ఆఫ్రికా చుట్టూ నౌకలను తీసుకురావటం ఇలా ఈ నాలుగు పాయింట్లు ప్రణాళికను అమలు చేసి పరిస్థితిని సాధారణ స్థితిలో ఉంచాలని భారత్ భావిస్తుంది.