దేశంలో కరోనా మార్చి నెల నాటికి అంతమవుతుందా.. ఈ నెలాఖరుకు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా.. నిపుణుల అంచనాల ప్రకారం కరోనా చివరి దశకు చేరుకుంటుందా.. రెండు నెలల తర్వాత వైరస్ నుంచి ఉపశమనం లభిస్తుందా.. అన్న ప్రశ్నలకు ఐసీఎంఆర్ సమాధానం ఇచ్చింది.
కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఐసీఎంఆర్(ICMR) గుడ్ న్యూస్ చెప్పండి. మార్చి 11 నాటికి కరోనా ముగింపు దశకు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. డెల్టా వేరియంట్ ను ఓమిక్రాన్ భర్తీ చేస్తే కోవిడ్ ‘ఎండెమిక్’ గా మారుతుంది. కొత్త వేరియంట్స్ పుట్టకపోతేనే మార్చి 11 నాటికి కోవిడ్ సాధారణ ప్లూగా మారుతుందని స్పష్టం చేసింది.
ఓమిక్రాన్ వేరియంట్ డిసెంబర్ 11 నుంచి మూడు నెలలపాటు కొనసాగుతుందని ఐసీఎంఆర్ (ICMR) చెప్పుకొచ్చింది. మార్చి 11 తర్వాత కరోనా నుంచి ఉపశమనం లభించవచ్చు అని వెల్లడించింది. ఢిల్లీ, ముంబై లో కరోనా గరిష్ట స్థాయికి చేరిందా.. లేదా.. అనే విషయం చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ కేసులు, పాజిటివ్ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికి ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఢిల్లీ, ముంబై లో ఒమిక్రన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయి. మహమ్మారి కరోనా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండి, దానికి తగ్గట్లే ఐసీఎంఆర్ పరీక్ష విభాగాలను మారుస్తుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తోడవడంతో థర్డ్ వేవ్ లో రోజుకు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈనెల 23న కేసులు రికార్డు స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రోజువారి కేసుల సంఖ్య 4 లక్షల లోపే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. మహారాష్ట్ర కర్ణాటక, యూపీ, గుజరాత్, హర్యానా లో ఈ వారం కోవిడ్ గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్, అసోం, తమిళనాడు లో వచ్చేవారం అత్యధిక సంఖ్యలో రోజువారి కేసులు నమోదవుతాయి. ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని నిపుణులు చెప్తున్నారు.