టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఆయన F3 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2019లో విడుదలైన F2 సినిమాకి సీక్వెల్. అయితే, F3 సినిమా F2 కి కొనసాగింపు కాదని, ఈ కథ పూర్తిగా భిన్నమైనది అని ఆయన చెప్పారు.
ఇటీవల అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా ప్రతి సినిమాకు నన్ను నేను సవాలు చేసుకుంటాను, అది నాలో కష్టపడేతత్వాన్ని మరింత పెంచుతుంది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2 మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలను కూడా అదే విధంగా చేశాను. ఇప్పుడు F3 సినిమా కూడా చేస్తున్నాను కానీ, ఇది F2 సినిమాకి కొనసాగింపు కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు.
“ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కి చెందిన అంశాలు ఈ సినిమాలో కూడా ఉంటాయి. F2 అనేది వైవాహిక సంబంధాల గురించి అయితే, F3 అనేది డబ్బు గురించి, ఈ కథ భిన్నమైనది” అని ఆయన చెప్పారు.