పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు అన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది.

ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సాలార్ మరియు నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్-k సినిమాలు ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయి. ఇది కాకుండా ప్రభాస్ స్పిరిట్ అనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రాజెక్ట్-k సినిమాలో స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ఒక కీలక పాత్ర చేయనున్నారు.

ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులే కాదు, హాలీవుడ్ దర్శకులు కూడా ఆరాతీస్తున్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాస్ అని నిర్మాత అశ్వినీ దత్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్-k సినిమా తర్వాత ప్రభాస్ హాలీవుడ్ చిత్రాలకు పరిమితమైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రభాస్ స్టార్ డమ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిని దాటింది. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో హాలీవుడ్ ని ప్రభావితం చేయటం గ్యారెంటీ అని.. ప్రభాస్ ఒకే అంటే పలువురు హాలీవుడ్ దర్శకులు ఆఫర్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు.

x