ప్రస్తుతం అరేబియన్ లో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి తీరం వైపుకు దూసుకువస్తుందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ తుఫాను పేరు తౌక్తా తుఫాను. ఈ తౌక్తా తుఫాను ఐదు రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాను తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల పై ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.
దీంతో ఆ రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అక్కడికి పంపించింది. ఇప్పటికే కేరళ రాష్ట్రము పై తుఫాన్ పంజా విసిరింది, అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి మరియు సముద్రం ఎగిసి పడుతుంది. భారీ అలలు ఎగిసి పడుతుండడంతో సముద్రం నీరు కోచ్చి కాలనీలను ముంచెత్తుతోంది.
ఆ ఐదు రాష్ట్రాలల్లో ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 53 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ తుఫాన్ కారణంగా ఈ నెల మే 16 నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ వల్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మే 15న గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించారు. అలాగే మే 16న గాలి వేగం పెరుగుతుందని సుమారు 80 కిలోమీటర్ల వరకు గాలి వేగం పెరగవచ్చని అధికారులు అంచనా వేశారు.
తౌక్తా తుఫాను ప్రభావం ఏపీ పై పెద్దగా ఉండదని అధికారులు తెలిపారు. అయితే అల్పపీడనం వల్ల మూడు రోజుల పాటు రాయలసీమ కు చెందిన జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఈ తౌక్తా తుఫాన్ వల్ల నైరుతి రుతుపవనాల రాక పై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ రుతు పవనాలు జూన్ రెండో వారంలో సాధారణంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి.
మరోవైపు రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలు దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించింది. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ రాష్ట్రలల్లో సుమారు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ నెల 15, 16వ తేదీన ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశా అంచనా వేస్తుంది.