సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఓ స్టార్ హీరో తన కొడుకుతో కలిసి చేసిన సినిమాలు చాలా చూశాము. ఉదాహరణకు 1. సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు కలిసి నటించిన రాజ కుమారుడు, వంశీ, టక్కరి దొంగ. 2. మోహన్ బాబు – మంచు విష్ణు కలిసి నటించిన రౌడీ, 3. నాగార్జున – నాగ చైతన్య కలిసి నటించిన మనం, 4. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన మగధీర ఇలా మొదలైనవి.
అయితే, హీరో తన కొడుకుతో కలిసి నటించినట్లే, హీరో తన కూతురితో నటించడం చాలా అరుదు. అసలు హీరో కూతురు సినిమాల్లోకి రావడం చాలా తక్కువ. అయితే ప్రస్తుతం తెలుగు తెరపై ఈ అరుదైన కలయికను మనం త్వరలోనే చూడబోతున్నాము.
ప్రస్తుతం సీనియర్ హీరో రాజశేఖర్ “శేఖర్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ అయినా ‘జోసఫ్’ సినిమాకు రీమిక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో ఆయన సొంత కూతురు శివాని కనిపించబోతుంది. అసలు ఈ పాత్ర కోసం వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కానీ, చివరికి శివాని తోనే ఈ సినిమా చేయించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమాలో శివాని పాత్ర ఉండేది కొంచెం సేపు అయినా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. రాజశేఖర్ భార్య జీవిత ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చెయ్యడం మరో విశేషం.
మొదట ఈ సినిమా కోసం లలిత్ అనే ఒక యువ దర్శకుడిని తీసుకున్నారు. కానీ, చివరికి జీవితనే ఈ సినిమాను టేకప్ చేసింది. తన భర్త, కూతుర్ని పెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేసింది. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్ లోకి రానుంది.