కూతురు ప్రేమించిందని తెలిసి తట్టుకోలేక పరువు హత్యలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఓ తండ్రి మాత్రం తన కోపాన్ని వినూత్న రీతిలో వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మార్టూరు గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన తమ సమీప బంధువును ప్రేమించండి. 9 సంవత్సరాల నుంచి వారి ప్రేమ కొనసాగుతుంది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో పిల్లలకు వేర్వేరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఆ ప్రేమ జంట ఈనెల 13న హైదరాబాద్ వెళ్లి ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు.

ఆ ప్రేమ జంట 15వ తేదీన గ్రామానికి తిరిగి వచ్చి ఓ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత గ్రామంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీ సమయంలో కన్నతండ్రి నీ పెళ్లి తర్వాత చేస్తాను తిరిగి ఇంటికి రమ్మంటూ కూతుర్ని పిలిచాడు. కూతురు వినకపోవడంతో పంచాయతీ జరుగుతుండగానే కూతురు పాదలకు నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత మరణించిన వారికి ఏర్పాటు చేసినట్లుగా శ్రద్ధాంజలి ఘటించే ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి తన కూతురు మరణించిందని పిండ ప్రధానం చేశాడు. బంధుమిత్రులు ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్, పేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

x