చదివింది ఐదో తరగతి అయినా గన్మెన్లను పెట్టుకొని ఫార్చునర్ కారు లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఉన్నతాధికారులను సైతం బురిడీ కొట్టించాడు. ముఖ్యమంత్రికి ఓఎస్డి అంటూ ఏకంగా ప్రజలకు సినిమా చూపించాడు. ప్రభుత్వ పథకాలను ఇప్పిస్తానని వందల మందిని నిండా ముంచాడు. సచివాలయంలో కార్ డ్రైవర్ గా పనిచేసి అక్కడకు వచ్చే వాళ్లతో పెంచుకున్న అనుబంధం తో జనాన్ని మోసం చేశాడు.

అతని పేరు సుధాకర్, ఒకరు ఇద్దరు కాదు ఏకంగా వందల మందిని రోడ్డు మీదకు తీసుకువచ్చాడు. కోట్ల రూపాయలను అందినకాడికి దోచుకున్నాడు అయితే ఇంత చేస్తున్న అతన్ని పట్టుకోవడానికి పోలీసులకు చాలా సమయం పట్టింది. ఎందుకో అతను చేసిన పాపం పండింది ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

ఇంతకీ అతడు జనానికి ఏం చెప్పాడు? ఎలా దోచుకున్నాడు? పెద్దపల్లి కి చెందిన సుధాకర్ ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఎంజాయ్ లైఫ్ కి అలవాటు పడిన సుధాకర్ హైదరాబాద్ కు వచ్చాడు. 2010 వ సంవత్సరం వరకు హైదరాబాద్ లో డ్రైవర్ గా పని చేశాడు. కొన్నాళ్లపాటు సచివాలయంలోని ఒక ఉన్నత అధికారి వద్దా ప్రైవేట్ డ్రైవర్ గా వర్క్ చేశాడు. సచివాలయంలో డ్రైవర్ గా పనిచేయడంతో ఎవరు ఏంటి అనే విషయాన్ని బాగా గమనించాడు.

అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల యొక్క శైలి ఎలా ఉంటుందని తెలుసుకున్నాడు. పూర్తిగా అధికారుల తీరును గమనించాడు. అక్కడ ఉండే లోటుపాట్లను తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతని బుర్రలో మెరుపులాంటి ఐడియా వచ్చింది. అది ఏంటంటే తాను ఒక అధికారిగా ఎందుకు నటించకూడదు అని రకరకాలుగా ఆలోచించాడు. చివరికి నకిలీ అధికారిగా అవతారమెత్తాడు. ఇందు కొరకు తన పక్కన ఇద్దరు గన్మెన్లను ఏర్పాటు చేసుకున్నాడు.

ఒక ఫార్చునర్ కార్ ను తీసుకొని పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళేవాడు ముఖ్యంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్తూ ఉంటాడు అక్కడ విపరీతంగా డబ్బు ఖర్చు పెడతాడు. వీటిని చూసిన జనం అతని గురించి ఆరా తీస్తారు. అప్పుడు జనం గన్మెన్ వద్దకు వచ్చి సుధాకర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. గన్మెన్ లు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డీగా పని చేస్తున్నారని చెబుతారు. సీఎంకు సుధాకర్ ఎంత చెబితే అంత అని నమ్మిస్తారు. అతని గెటప్ చూసి జనం కూడా పడిపోతారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తాడు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి న లబ్ధిదారుల ఎంపిక కూడా తానే చేస్తానని నమ్మబలికాడు. వీటన్నిటిని చూసిన తర్వాత సాధారణంగా చాలామంది సుధాకర్ చెప్పే మాటలకు బట్టలో పడిపోతారు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో ఎంత డబ్బులు అయినా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

దీనితో పాటుగా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని పెద్ద మొత్తంలో ప్రచారం చేశాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బులు కొట్టేశాడు. హైదరాబాద్, రాచకొండ పరిధిలో మూడు నెలల కాలంలోనే చాలా మంది దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశాడు. కోట్ల రూపాయలు పథకాల పేరుతో దండుకున్నాడు. అతని మీద మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి.

ఈ సంవత్సరంలోనే చాలా మంది బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి కేసులు పెట్టారు. సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని విచారణ జరిపాక చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాలు పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తారు, వెంటనే సెల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటాడు, తాను ఉంటున్న ఇంటిని మార్చేస్తాడు. ఎవరైనా డబ్బులు అడిగితే గన్మెన్ల తో బెదిరిస్తాడు. అంతేకాకుండా సెటిల్మెంట్ పేరుతో పిలిపించి భయపెట్టే పంపిస్తాడు.ఇప్పటివరకు మూడు వందలకు పైగా బాధితులు సుధాకర్ బారిన పడ్డారు.

నకిలీ ఐడీ కార్డులు కూడా సుధాకర్ గ్యాంగ్ సృష్టించింది. ముఖ్యంగా నకిలీ ఆధార్ కార్డు తో పాటు ముఖ్యమంత్రి ఓఎస్డీ పేరుతో కూడా డూప్లికేట్ ఐడి కార్డ్ తయారు చేశారు. దీనితో పాటు సచివాలయ ఉద్యోగాల పేరుతో ఐడి కార్డులు తయారు చేశారు. సచివాలయంలో ఎంట్రీ పాస్ లు సర్టిఫికెట్లు తయారు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రబ్బర్ స్టాంపు తో సహా ఐడి కార్డులు ఎవరికైనా తయారు చేసినట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.

x