హైదరాబాద్ నారాయణగూడ లోని అవంతి నగర్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగడంతో ఒకరు మరణించగా, మరో నలుగురు అనారోగ్యానికి గురయ్యారు. దట్టమైన పొగ మంటలతో ఊపిరాడక ఆ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని వెంటనే స్పందించి అక్కడ ఉన్న నలుగురిని కాపాడారు.
తీవ్రంగా గాయపడిన భాదితులను సమీప హాస్పటల్ కు తరలించారు. ఎయిర్ కండీషనర్ నుండి ఒక షార్ట్ సర్క్యూట్ మంటలకు దారితీసిందని అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గౌరీ నాథ్ (38) తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా, ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగాయి.
“పొగ మరియు మంటలు పూర్తిగా ఇంట్లో వ్యాపించాయి, వారు భయాందోళనకు గురయ్యారు. పక్కన వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సంఘటన మంటలను ఆర్పేసింది, ”అని ఒక అధికారి తెలిపారు, జరిగిన ప్రమాదంలో గౌరీ నాథ్ మరణించారు. నారాయణగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.