first innings:
ఎట్టకేలకు ఐపీఎల్ 14వ సీజన్ మొదలైంది. ఈ సీజన్ లో మొట్ట మొదటి మ్యాచ్ RCB మరియు MI మధ్య జరిగింది. ఈ మొదటి మ్యాచ్లో RCB టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకోండి. దీంతో ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగారు. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ మరియు క్రిస్ లిన్ మొదట బ్యాట్టింగ్ కు వచ్చారు. మంచి అంచనాలతో బ్యాట్టింగ్ కు దిగిన MI కు పవర్ ప్లే లో బ్రేక్ పడింది.
రోహిత్ శర్మ 15 బాల్స్ లో కేవలం 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, క్రిష్ లిన్ తో కలిసి ఒక చక్కటి పార్ట్నర్షిప్ నిలిపారు. న 11వ ఓవర్లో వీరి పార్టనర్ షిప్ బ్రేక్ పడింది. సూర్య కుమార్ యాదవ్ 23 బాల్స్ లో 31 పరుగులు చేసి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత గ్రీజు లోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. క్రిస్ లిన్ అద్భుతంగా అవుతున్న తరుణంలో వాషింగ్టన్ సుందర్ వేసిన బాల్ కు క్రిష్ లిన్ ఔటయ్యాడు. క్రిస్ లిన్ 49 పరుగుల వద్ద అవుటయ్యాడు.ఇంకా ఒక్క పరుగు చేసి ఉంటే తన ఆఫ్ సెంచరీ పూర్తయ్యేది.
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, పొలార్డ్, మరియు కృనాల్ పాండ్యా వారి బ్యాట్ తో పెద్దగా మెరుపులు మెరిపించి లేకపోయారు. ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 ఓవర్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశారు. RCB బౌలర్ హర్షల్ పటేల్ లాస్ట్ ఓవర్ వేసి కేవలం ఒక రన్ ఇవ్వటమే కాకుండా మూడు వికెట్లను తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు, అంతేకాకుండా 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో RCB వాళ్ళు చాలా క్యాచ్ లు మిస్ చేశారు. అయినప్పటికీ RCB బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ వేసి MI ని కట్టడి చేయగలిగారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్ కు తొమ్మిది వికెట్లు కోల్పోయి, 159 పరుగులు చేసింది.
second innings:
చేజింగ్ కు దిగిన RCB మొదట విరాట్ కోహ్లీ మరియు వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు దిగారు. వాషింగ్టన్ సుందర్ 16 బాల్స్ ఆడి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ కూడా సరిగ్గా ఆడలేదు, 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత వచ్చిన మాక్స్ వెల్, విరాట్ కోహ్లీతో కలిసి చక్కటి ఇన్నింగ్స్ను ఆడాడు. వీరిద్దరూ మంచి పార్ట్నర్షిప్ గా నిలుస్తున్న టైములో రోహిత్ శర్మ బుమ్రా ను బౌలింగ్కు తీసుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ బుమ్రా వేసిన బౌలింగ్లో ఎల్బీడబ్ల్యు అయ్యాడు.
విరాట్ కోహ్లీ 29 బాల్స్ లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత మైదానంలోకి బ్యాటింగ్ చేయుటకు ఏబీ డివిలియర్స్ వచ్చాడు. అప్పుడు దాక బాగా ఆడిన మ్యాక్స్వెల్, జాన్సన్ వేసిన బౌలింగ్లో బాల్ ను బ్యాక్ సైడ్ ఫోర్ పంపిద్దాం అనుకొని క్రిష్ లిన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అహ్మద్, క్రిస్టియన్ పెద్దగా మెప్పించలేకపోయారు. కానీ ఏబీ డివిలియర్స్ మాత్రం చివరి వరకు పోరాడి లాస్ట్ ఓవర్లో రెండు పరుగులు కొట్టాల్సి ఉండగా రనౌట్ అయ్యి వెనుతిరిగి వెళ్లాడు. ఏబీ డివిలియర్స్ కేవలం 27 బాల్స్ లో 48 పరుగులు చేశాడు. దీంతో RCB రెండు వికెట్ల తేడాతో ముంబై ఫై విజయాన్ని సొంతం చేసుకుంది. హర్షల్ పటేల్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఎప్పటిలాగే ముంబై తన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది.