ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కరోనా రెండో దశ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాస్క్ లు మరియు శానిటైజెర్లు నిరంతరం వాడుతూ ఉండమని ప్రభుత్వం ఎంత చెప్పిన కొంత మంది మాత్రం మాస్క్ లు లేకుండా రోడ్ పైకి వస్తున్నారు.

మాస్క్ లేకుండా ప్రయాణం చేస్తున్న ఒక మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ను అపి పోలీసులు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ‘తీగల కృష్ణారెడ్డి’ గారి కారును కర్మాన్ షూట్ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీ చేశారు. మాస్క్ లేకుండా కారులో ప్రయాణం చేస్తునందుకు పోలీసులు తీగల కృష్ణా రెడ్డి పై జరిమానా విధించారు. ఈ విషయం పై సబ్ ఇన్స్పెక్టర్ ముఖేష్, తీగల కృష్ణారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాకు అందరు సమానమే అంటూ వెయ్యి రూపాయల జరిమానా విధించారు పోలీసులు.

image source

x