ప్రస్తుతం వరుస ఓటములతో బాధపడుతున్న టీడీపీకి విశాఖ జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే “శోభా హైమావతి” టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. శోభా హైమావతి 1999 – 2004 వరకు ఎస్. కోట ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్నారు. అంతర్గత రాజకీయాలు భరించలేక టీడీపీని వీడుతున్నట్లు హైమావతి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా మారింది. టీడీపీకి చెందిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఒకవైపు టీడీపీ పార్టీని నిలబెట్టాలని చూస్తుంటే.. మరోపైవు నాయుకులు ఈ విధంగా రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత రాజీనామా చేయటం చాలా సంచలనంగా మారింది.
ఆమె టీడీపీ పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె కొంతకాలంగా వైసీపీ నాయకులను కలుస్తునట్లు.. ప్రస్తుతం జగన్ హామీ ఇవ్వటంతో.. ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.