కరోనా మహమ్మారి ఎందరో గొప్పవారితో పాటు కిరాతకులను కూడా బలి తీసుకుంది. మాజీ అండర్ వరల్డ్ డాన్ మరియు మాజీ గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కరోనా భారిన పడి మృతి చెందాడు. ఎయిమ్స్‌ హాస్పిటల్లో కరోనా కు చికిత్స పొందుతు శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రాణాలు విడిచారు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. ఆయన వయస్సు 62 సంవత్సరాలు.

2015 వ సంవత్సరంలో ఇండోనేషియాలో రాజన్‌ను అరెస్టు చేసి భారత్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీ లోని తీహార్ జైలులో ఉంచారు. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన తరువాత ఏప్రిల్ 26 న అతని ఎయిమ్స్‌లో చేర్చారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పలువురు సామాన్య ప్రజలు ఆసుపత్రులలో చేరేందుకు బాధపడుతుంటే, రాజన్ ను మాత్రం ఎయిమ్స్‌లో జాయిన్ చేయడం వివాదానికి దారితీసింది.

రాజన్ ఒక గ్యాంగ్ స్టర్ మరియు భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం పనిచేశాడు. రాజన్ ఒకప్పుడు దావూద్‌కు కుడి బుజం లాంటి వాడు. రాజన్ సొంతగా ముఠాను ఏర్పాటు చేసుకోవడం తో వారిద్దరూ విడిపోయారు. ఇదే వారి ఘర్షణకు దారితీసింది.

దోపిడీ మరియు హత్యకు సంబంధించి మహారాష్ట్రలో కనీసం 70 క్రిమినల్ కేసులలో రాజన్ నిందితుడు. అతను ఏప్రిల్ 26 న వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా సెషన్స్ కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అతన్ని విచారణకు హాజరుపరచలేమని తీహార్ జైలు అధికారులు కోర్టుకు తెలియజేశారు. రాజన్ మరణంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

x