కర్నూలు జిల్లా నంద్యాల లో విషాదం చోటుచేసుకుంది. నంద్యాల లోని మాల్డర్ పేట లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారు రాత్రి భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని కుటుంబం లోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే చంద్రశేఖర్ అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

తెల్లవారుజామున వారి కుటుంబ సభ్యులు ఎవరు బయటకు రాకపోవడంతో, స్థానికులు గమనించి కిటికీ లో నుంచి తొంగి చూడగా వారి కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉన్నారు అది చుసిన స్థానికులు వెంటనే తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే వారు అందరూ చనిపోయారు. స్థానికులు వెంటనే వారి బందువులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ ఒక బంగారు షాప్ లో పని చేసేవాడని, ఇటీవల ఒక ఇల్లు కూడా కట్టించారు దీంతో అప్పులు ఎక్కువ కావడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు.

x