ఒక సాధారణ వ్యక్తి దేశ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించిన సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రాన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన డ్రోమ్ రీజియన్‌లోని టెయిన్-ఐ హెర్మిటేజ్ అనే గ్రామంలో జరిగిందీ.
మంగళవారం ఒక పర్యటనకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మధ్యాహ్నం సమయంలో ఒక హై స్కూల్ ను పర్యటించాడు. దాని తర్వాత అధ్యక్షుడు కారు వైపు వెళ్తుండగా, అక్కడ ఉన్న ప్రేక్షకులు తమ వద్దకు రావాలని గొడవ చేయడంతో అధ్యక్షుడు వాళ్ళ వద్దకు చేరుకున్నాడు.
ఈ క్రమంలో అధ్యక్షుడు అక్కడ ఉన్న వారికీ షేక్ హ్యాండ్ ఇస్తుండగా ఒక వ్యక్తి మాత్రం అధ్యక్షుడు చెంప చెళ్లుమనిపించాడు. దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధ్యక్షుడుని వెనక్కి లాగి ఆ వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మాద్యమాలల్లో వైరల్‌గా మారింది.
అధ్యక్షుడి పై దాడికి ప్రయత్నించినా వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి కూడా తమ అధీనంలో ఉన్నారని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు పై దాడిని ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ ఖండించారు. రాజకీయాల్లో హింసకు తావులేదని ఆయన అన్నారు.