సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టడం పై కేంద్ర రాష్ట్రాలు ఎంతో కృషి చేస్తున్నాయి. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉండటం, కరోనా పాజిటివ్ రేటు కూడా పెరిగిపోతుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి మరియు మరికొన్ని అంక్షలను పొదిగి ఇస్తున్నాయి. కోవిడ్ కేసులతో వణికిపోతున్న ఢిల్లీ, కర్ణాటక రాష్టాలు లాక్‌డౌన్‌ ను కొనసాగిస్తున్నాయి.

ఓ వైపు లాక్ డౌన్ పెడుతూనే కోవిడ్ పేషంట్స్ కు అవసరమైన చికిత్స సమకూర్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా హాస్పటల్లో బెడ్స్ కొరత మరియు ఆక్సిజన్ షార్ట్ ఏజ్ లకు పరిష్కారం అన్వేషిస్తున్నారు. కోవిడ్ కేసులను అరికట్టేందుకు గోవా ప్రభుత్వం నేటి నుంచి మూడవ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించింది.

రాత్రి 8 గంటల నుంచి మే మూడో తేదీ ఉదయం వరకు ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులు, పరిశ్రమలు మూతపడవని గోవా సీఎం తెలిపారు. మహారాష్ట్రలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ తరహా అంక్షలను మరో 15 రోజులు పొడిగించారు. ఒక పక్క ఏపీ, తెలంగాణ తో పాటు పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు ఈ కంప్యూ అమలులో ఉంది.

x